గుడిలో దండలు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్న ఐఏఎస్ జంట

పెళ్ళి అంటే ఎంతో ఆర్భాటం, మరెంతో హడావుడి కాదని.. మనసుల కలయికేనని చాటిచెప్పారు ఇద్దరు ఐఏఎస్ అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీ పూజ, మేఘాలయ కేడర్ అధికారి ఆదిత్య వర్మ విశాఖలోని ఒక ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే విశాఖపట్నంలోని సూపర్‌ బజార్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో తమ వివాహానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్దిమంది ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. శ్రీ పూజ కడప జిల్లా వాసి కాగా, ఆదిత్య వర్మ యూపీకి చెందినవారు.

సంబంధిత పోస్ట్