సోదరితో సహా IB అధికారి ఆత్మహత్య

UPలోని ఘజియాబాద్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. అవినాష్ (28) ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సోదరి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. సవతి తల్లి బయటకు వెళ్లి వచ్చేలోపు సోదరితో సహా అవినాష్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ లభించలేదని, వారి ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియలేదని ACP భాస్కర్ వర్మ వెల్లడించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్