iBOMMA రవి దొరికిపోయింది భార్య వల్ల కాదు!

iBOMMA నిర్వాహకుడు రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడనే ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులైనట్లు సమాచారం. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ దొరికింది. అది మూసాపేట్‌లోని అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్