ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మొత్తం టోర్నీ వాయిదా పడడంతో మిగిలిన మ్యాచ్‌లను ఎప్పుడు నిర్వహిస్తారనే ఆసక్తి నెలకొంది. టీమిండియా ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాతే ఐపీఎల్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో భారత్‌లో వర్షాకాలం కావడంతో మ్యాచ్‌లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీంతో, మిగిలిన మ్యాచ్‌లను విదేశాల్లో గానీ, సెప్టెంబర్‌లో గానీ నిర్వహించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.