ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ కోసం 'బ్రింగ్ ఇట్ హోం' పేరుతో అధికారిక టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన శక్తివంతమైన స్వరంతో ఆలపించారు. ఈ పాట ప్రపంచకప్ కు మరింత ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఐసీసీ ఎక్స్ వేదికగా ఈ పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ శుక్రవారం ట్వీట్ చేసింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వరకు జరగనున్న సంగతి తెలిసిందే.