ఈనెల 7న ఐసెట్ ఫలితాలు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2025 ఫలితాలు జులై 7న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఐసెట్ కన్వీనర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవి, వీసీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 64,938 మంది పరీక్షకు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్