‘ఇడుపు కాయితం’ సినిమా హీరోయిన్, ఫోక్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందిన నాగదుర్గకు ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’లో పాల్గొనే అవకాశం వచ్చినా, తాను తిరస్కరించినట్లు వెల్లడించారు. తాను చాలా సైలెంట్‌గా ఉంటానని, బిగ్‌బాస్ తరహా వాతావరణానికి సెట్ కాదనిపించడంతో ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. చిన్న విషయాలకే భావోద్వేగానికి లోనవుతానని, ఎదుటివారి మనసు నొప్పించలేనని తెలిపారు. తన తల్లి షోకు వెళ్లొద్దని చెప్పగా, తండ్రి మాత్రం కొద్ది వారాలైనా ఉంటే గుర్తింపు పెరుగుతుందని సూచించారని చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని స్పష్టం చేశారు.