TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం షేక్‌పేట్‌లో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలితే ఇక అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదు" అని హెచ్చరించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కి మరోసారి అవకాశం ఇవ్వాలని KTR కోరారు.