TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి పాలన అని, జీవితంలో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఒకవేళ అధికారంలోకి వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత్రికేయుల సాక్షిగా మరణ వాంగ్మూలం రాసిస్తానన్నారు. కాంగ్రెస్ నేతల పాలనతో ప్రజలు విసిగిపోయారు అని మండిపడ్డారు.