రాహుల్‌ జోలికి ఈడీ వస్తే ఊరుకోం: మహిళా ఎంపీ

తనపై ఈడీ దాడులు చేయాలని కుట్ర పన్నుతున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. రాహుల్‌ గాంధీ ఇంటికి దర్యాప్తు సంస్థలు వెళ్తే కూటమి భాగస్వాములు చూస్తూ ఉండరని.. కలసికట్టుగా వాటిపైకి ఎదురు తిరుగుతారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రజలు బుద్ధి చెప్పినా బీజేపీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్