TG: ఆరడుగుల హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నాడని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హరీశ్ రావు, కేసీఆర్ సంతకాలు పెట్టి తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుని ఏపీ నిర్మిస్తోందని ఆరోపించారు. హరీశ్ రావు చేతకానితనం వల్లే బనకచర్ల నిర్మిస్తున్నారని మండిపడ్డారు. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పారు.