తాను దైవభక్తి గల వ్యక్తినని, చనిపోతే స్వర్గానికే వెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సీబీఎస్ ఇంటర్వ్యూలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలపై తాను కఠిన చర్యలు తీసుకున్నానని ఆయన సమర్థించుకున్నారు. క్రిమినల్స్‌ను వెళ్లగొట్టినందుకు సపోర్ట్ లభించినా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇరాన్‌తో యుద్ధం, ఇంధన ధరల పెరుగుదల, ఇజ్రాయెల్ అంశాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. భవిష్యత్తులో డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని తెలిపారు.