బ్రియాన్ లారాపై గౌరవంతోనే తాను 400+ పరుగుల రికార్డును వదిలేసినట్లు ముల్డర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ముల్డర్‌తో మాట్లాడారు. లారాతో జరిగిన సంభాషణను ముల్డర్ బయటపెట్టాడు. ‘రికార్డులు ఉండేదే బ్రేక్ చేసేందుకని లారా చెప్పారు. ఆయన ఘనతను మరొకరు అధిగమించాలని కోరుకున్నారు. ఒకవేళ మరోసారి ఛాన్స్ వస్తే మాత్రం నన్ను వదులుకోవద్దని సూచించారు’ అని ముల్డర్ వెల్లడించాడు.