డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. రోడ్డుపై లోతైన గుంతలు ఏర్పడగా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. యూత్ కాంగ్రెస్ ‘రూ.13 వేల కోట్ల ఎక్స్‌ప్రెస్ హైవే ఇలా త్వరగా దెబ్బతింటుందా’ అంటూ గడ్కరీపై ట్వీట్స్ చేశారు. ఈ నిర్మాణం లోపభూయిష్టంగా జరగిందని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దీనిపై స్పందించాలని కోరుతున్నారు.