మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవమే: CM రేవంత్

TG: గండిపేట మండలం మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం దేవుడి నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. తెలిసో తెలియకో నదులను కలుషితం చేస్తున్నామని, కాలుష్యం వల్లే వచ్చే సమస్యలేంటో ఢిల్లీని చూస్తే తెలుస్తోందన్నారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామని, ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్