TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పవన్ మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలి ఆంధ్రాలో ఉండాలని సూచించారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు పవన్ క్షమాపణలు చెప్పకపోతే ప్రజలు పరిగెత్తించి తరిమికొడతారని హెచ్చరించారు.