సంజయ్‌దత్ సమాచారమిస్తే ఆ పేలుళ్లే జరిగేవి కావు: ఉజ్వల్ నికమ్

ముంబై పేలుళ్ల కేసు న్యాయవాదిగా పనిచేసిన ఉజ్వల్ నికమ్ తాజాగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 1993లో ఆయుధాల వ్యాన్ గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, ముంబై పేలుళ్లు జరిగేవి కాదని పేర్కొన్నారు. మూడుదశాబ్దాల క్రితం దేశ ఆర్థిక రాజధానిని వణికించిన ఆ ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో చెరగని ముద్రవేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్