అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఘాటుగా స్పందించారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న పాక్–అఫ్గాన్ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్ధం తప్పదని హెచ్చరించారు. అయితే అఫ్గానిస్థాన్ శాంతిని కోరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో జరిగిన దోహా చర్చల్లో ఇరుదేశాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించగా, ఇస్తాంబుల్ చర్చలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి.