గోళ్ల రంగు మారితే ఈ తీవ్ర వ్యాధులకు సంకేతమా?

గోళ్ల రంగు మారడం, వాటిపై మచ్చలు, గీతలు వంటివి వివిధ ఆరోగ్య సమస్యలకు సూచనలు కావచ్చు. పసుపు రంగు గోళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్, మధుమేహం వంటివి సూచిస్తాయి. తెల్లటి మచ్చలు పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లకు సంకేతం. నీలిరంగు గోళ్లు ఆక్సిజన్ సరఫరా లోపం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులను సూచిస్తాయి. గోళ్ల మొదట్లో ఎరుపు నెలవంకలు గుండె జబ్బులు, ఆర్థరైటిస్, లూపస్‌కు సంకేతం. నల్లటి గీతలు చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు. గోళ్లు ఉబ్బినట్లు మారడం (నెయిల్ క్లబ్బింగ్) ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సమస్యలను సూచిస్తుంది. ఈ మార్పులను గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్