కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత కరెంట్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అయితే ఈ 10 గ్యాంరటీలపై ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో తాను చర్చించలేదని, ఈ గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.