సుప్రీంకోర్టు నో చెబితే పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు: CBN

AP: స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై వచ్చే వారంలో సుప్రీంకోర్టు నిర్ణయం రావొచ్చని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్ లో అన్నారు. ఆ వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించకపోతే పార్టీపరంగా ఇస్తామని తెలిపారు. తొలి దశలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕