హైదరాబాద్‌లోని చింతలబస్తీలో నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. డీ సిల్టింగ్ పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు త్వరగా జరగాలన్నారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని.. నాలా ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలని సూచించారు. శుక్రవారం చింతల్‌బస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడారు.