ముగ్గురు చిన్నారులు చనిపోతే పైసా సాయం చేయరా?: కవిత

TG: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారుల మృతి ఘటనపై మంగళవారం టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే ఎక్కువ బాధించిందని ఆమె అన్నారు. ముగ్గురు చిన్నారులు చనిపోయినా, బాధిత కుటుంబాలకు కనీసం పైసా సాయం చేయలేదని విమర్శించారు. హెల్త్ మినిస్టర్ కేవలం ఫోటోలు దిగేందుకే ఘటన స్థలానికి వెళ్లారని, కనీస మానవత్వం ప్రదర్శించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి బుదవారం ఆదిలాబాద్‌కు వెళ్లనున్నట్లు కవిత తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕