TG: కేటీఆర్ నేతృత్వంలో కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న BRS బృందాన్ని జనగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ఒక్కరికే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. 'పైన నీళ్లు లేక రైతులు నాట్లు వేసే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం కన్నేపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయడం లేదు' అని కేటీఆర్ మండిపడ్డారు.