తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన 'రామలింగం' ప్రధాన దైవం. ఆలయంలో 22 పవిత్ర తీర్థాలు, ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్ ఉన్నాయి. ఈ బావుల నీటికి వైద్య గుణాలున్నాయని, అన్ని రోగాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ నీటితో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.