HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కీలక మార్పు అమల్లోకి వచ్చింది. జూలై 1 నుంచి స్మార్ట్‌బై ద్వారా కొనుగోలు చేసే బ్రాండ్ గిఫ్ట్ వౌచర్లపై అదనపు రివార్డ్ పాయింట్లకు నెలవారీ పరిమితిని విధించింది. జీఐఎఫ్‌టీఆర్, వూహూ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ తదితర బ్రాండ్‌ల గిఫ్ట్ వౌచర్లు కొనుగోలు చేసి అధిక రివార్డ్ పాయింట్లు పొందుతున్న హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుదారులకు ఈ మార్పు ప్రభావం చూపనుంది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రీమియం క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఇకపై ఒక క్యాలెండర్ నెలలో గరిష్టంగా 3,000 అదనపు రివార్డ్ పాయింట్లు మాత్రమే పొందగలరు.