ఆ ఆలయంలో నీరు తాగితే ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ మాయం.. ఎక్కడో తెలుసా?

ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలోని అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సంజీవరాయ పుష్కరిణి నీటికి దివ్య ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని తెస్తుండగా పర్వతంలో సగభాగం విరిగిపడిన ప్రాంతమే అర్ధగిరి. ఈ కోనేటి నీటిని 40 రోజుల పాటు సేవిస్తే టి.బి., ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు నయమవుతాయని ప్రసిద్ధి. స్వామిని దర్శిస్తే వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్