ప్రతి నెలా వచ్చే జీతాన్ని ఎలా సక్రమంగా వినియోగించుకోవాలో చాలా మందికి తెలియదు. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటూ ఆనందంగా జీవించవచ్చు. వాస్తవానికి మనకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు పెట్టేయకూడదు. అవసరాలకు అనుగుణమైన ఖర్చులు చేసి, మిగిలింది పొదుపు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 50-30-20 రూల్ ఉపయోగించి భవిష్యత్‌ను ఎలా ఆర్థికంగా సుస్థిరం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.