నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రత్యేక తనిఖీలు, జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నా కొందరు మారడం లేదు. వీకెండ్లలో రాత్రివేళల్లో నిర్వహించే డ్రైవ్‌లలో పట్టుబడిన వారిని కోర్టులకు హాజరుపరుస్తున్నా, కొందరు అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ జరిమానాలు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.