బిహార్‌లో ఓ వృద్ధుడికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ముజఫర్‌పుర్‌కు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా తన వృద్ధాప్య పింఛన్‌ను తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయగా ఖాతాలో ఏకంగా రూ.759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. అనంతరం ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాను పరిశీలించగా అందులోనూ దాదాపు అదే మొత్తం నమోదై ఉండటంతో సీఎస్‌సీ సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రీకొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి రూ.1,500 కోట్లకుపైగా బ్యాలెన్స్ కనిపించడంతో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.