ఆధారలు ఉంటే సీబీసీఐడికి ఇవ్వండి: సీఎం రేవంత్

TG: అక్రమ మైనింగ్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా, మంత్రి పొంగులేటి, తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. ఈ అక్రమ మైనింగ్‌లో తమవారి ప్రమేయం ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలను సీబీసీఐడీకి సమర్పించాలని ఆయన సవాల్ చేశారు. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులనే దుష్ట సంప్రదాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆరే నాంది పలికారని విమర్శించారు. రూ.1.10 కోట్ల జీతం తీసుకుంటూ సభకు హాజరుకాని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్