నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్’లో హీరో పాత్ర లాంటి వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అలాంటి వ్యక్తితో డేటింగ్‌కు అభ్యంతరం లేదన్నారు. అలాగే "ప్రేమలో మార్పు సహజం, ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ప్రేమిస్తే ఒకరి కోసం ఒకరు మారుతారు" అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.