పీవోకే ప్రధానిగా ఇఫ్తికార్‌ జిలానీ

ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రధానమంత్రి పదవికి ఇఫ్తికార్‌ జిలానీని పాకిస్తాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌(ఎన్‌) అధిపతి నవాజ్‌ షరీఫ్‌ ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంఎల్‌(ఎన్‌) అత్యధిక సీట్లు గెలుచుకుంది. ముజఫరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇఫ్తికార్‌ జిలానీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, నిపుణుల కోటాలో ఆయనను అసెంబ్లీకి నామినేట్‌ చేయడంతో ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారం జరిగే సమావేశంలో ఆయన ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕