హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్ (20) అనే విద్యార్థి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.