వైభవ్‌ సూర్యవంశీపై ఐఐఎమ్‌ అధ్యయనం

ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండోర్‌) ప్రత్యేక అధ్యయనం నిర్వహించనుంది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించే ప్రతిభావంతులపై ఖ్యాతి, అంచనాల ఒత్తిళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఐఐఎం పరిశోధన చేయనుంది. వైభవ్‌ లాంటి బాల మేధావులు అద్భుత ప్రదర్శనలు చేసేందుకు ప్రేరేపించే కారకాలు, వారి ప్రాక్టీస్, మనస్తత్వం, అడ్డంకులను ఎలా ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను పరిశోధించనున్నట్లు ఐఐఎం డైరెక్టర్‌ హిమాంశు రాయ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్