ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించడం, కుల వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అధికారులు సెలవుపై పంపినట్లు సమాచారం. ఈ కేసులో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధితుల కుటుంబం ఆరోపణలు, ఐఐటీ బాంబే వివరణలను అధికారులు పరిశీలిస్తున్నారు.