దివ్యాంగురాలైన బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. మహారాష్ట్ర ఠానే ప్రాంతానికి చెందిన అద్వైత్ కొచారే (23) ఐఐటీ ఖరగ్ పూర్‌లో 3వ సంవత్సరం చదువుతూ, స్టడీ బ్రేక్ కోసం తన ఇంటికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు కొత్త బట్టల ఆశ చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. కాగా నిందితుడి ఫోన్‌లో అమ్మాయిల ఫొటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.