గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలోకి నకిలీ పాస్పోర్టుతో ప్రవేశించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'భాను ప్రతాప్' అనే పేరుతో, 2021లో జారీ అయిన నకిలీ పాస్పోర్టుతో అతను అమెరికాలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పత్రాలు చెబుతున్నాయి. గత నవంబర్‌లో కాలిఫోర్నియాలో అరెస్ట్ అయిన బిష్ణోయ్‌ని, బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై దేశవ్యాప్తంగా డజనుకు పైగా కేసులున్నాయి.