డబ్బు సంపాదించాలనే దురాశతో రెడ్ ఇయర్ (ఎరుపు రంగు చెవుల) తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సయ్యద్ అవైజ్ (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఘటనపై సోదాలు నిర్వహించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవైజ్‌పై తాబేళ్ల అక్రమ రవాణా, విక్రయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.