అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన వైద్యులు, స్థానికుల కుటుంబాలకు కూడా రూ.కోటి పరిహారం ఇవ్వాలని టాటా గ్రూప్‌కు ఐఎంఏ లేఖ రాసింది. గాయపడినవారికీ ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. ప్రయాణికులకిచ్చినట్లే మిగిలిన మృతుల కుటుంబాలను కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై ఇద్దరు డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం తగిన పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.