ప్రపంచంలోనే తొలిసారిగా, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ గర్భస్థ శిశువు గుండెకు ఇమ్యునోథెరపీ ద్వారా అత్యాధునిక చికిత్సను విజయవంతంగా అందించింది. 29 ఏళ్ల మహిళ గర్భం దాల్చినప్పుడు, పిండం గుండె బలహీనంగా, స్పందనలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. తల్లిలోని స్జోగ్రెన్స్ సిండ్రోమ్, స్టోమెటిక్ లోపాజ్ ఎరితోమస్ లేదా యాంటీ బాడీస్ వంటి కారణాల వల్ల శిశువు గుండె పనితీరుకు భంగం కలుగుతుందని వైద్యులు తెలిపారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం వ్యూహాత్మకంగా పిండానికి చికిత్స అందించి, గుండె పనితీరును మెరుగుపరిచింది. ఈ చికిత్స ద్వారా ఐదుగురు శిశువులను కాపాడి, సుఖ ప్రసవం కలిగించడంలో విజయం సాధించారు. ఈ వివరాలను JACC కేసు నివేదికలో ప్రచురించారు.