జీఎస్టీ 2.0 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఉండనున్నట్లు ఆడీ ఇండియా ప్రకటించింది. తమ వాహన మోడళ్లపై రూ.2.6 లక్షల నుంచి రూ.7.8 లక్షల వరకు ధరలు తగ్గుతాయని తెలిపింది. కొత్త ధరల ప్రకారం SUV Q3 ప్రారంభ ధర ఇప్పటివరకు రూ.46.14 లక్షలుగా ఉండగా, జీఎస్టీ తగ్గింపు అనంతరం అది రూ.43.07 లక్షలకు తగ్గనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ధరలు సెప్టెంబరు 22 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.