నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ల అధిక వాడకం యువ జంటల్లో హార్మోన్ల సమతుల్యత, లైంగిక కోరిక, సంతానోత్పత్తిని దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట స్క్రీన్ టైమ్, బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగించి, మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని, లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అండం విడుదల ఆలస్యం కావడం, వీర్య కణాల సంఖ్య తగ్గడం, అంగస్తంభన సమస్యలు వంటివి తలెత్తుతున్నాయి.