రాష్ట్రపతి పాలన విధించుకోండి.. కేంద్రానికి మమతా సవాల్

సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే తనను డిస్మిస్ చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన విధించుకోవాలని ఆమె కేంద్రానికి సవాల్ విసిరారు. మే 9న బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేయనుండగా ఆ రోజును 'బ్లాక్ డే'గా పాటిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోయినా పోరాటం ఆపబోమని ఆమె అన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు మమతా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్