రోజుకు 5 నిమిషాల నవ్వుతో ఆరోగ్యం మెరుగుపరుచుకోండి!

నవ్వు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు కేవలం 5 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నవ్వు వల్ల 'ఎండార్ఫిన్స్' అనే హ్యాపీ హార్మోన్లు విడుదలై నొప్పి నివారిణిగా పనిచేస్తాయని, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్