మహారాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడదను అరికట్టేందుకు ఒక వినూత్న పథకాన్ని ప్రకటించింది. రివెస్ట్ మకాక్, హనుమాన్ లంగూర్ కోతులను పట్టుకొని, వాటిని నివాస ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలో తరలించిన వారికి ఒక్కో కోతికి రూ.600 ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యలన్నీ జంతు సంక్షేమ నిబంధనలకు లోబడి చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా కోతుల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.