తూర్పు నౌకాదళ కమాండ్ 2008లోనే VLF రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి వికారాబాద్‌లో సుమారు 2,730 ఎకరాలు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో దీనికి సంబంధించి జీవో జారీ చేసినప్పటికీ, లక్షల సంఖ్యలో చెట్లు నరికివేతతో సంభవించే దుష్ప్రభావాల గురించి స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నేవీకి భూమిని కేటాయించలేదు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి.