ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, యనమదుర్రు గ్రామంలో ఉన్న శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఆలయంలో శివుడు తలక్రిందులుగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి జటాజూటం నేలను తాకుతుండగా, పాదాలు ఆకాశం వైపు ఉంటాయి. అమ్మవారు పసికందుతో కాపలాగా ఉంటారు. ఈ క్షేత్రంలో శక్తికుండంలో స్నానం చేస్తే అకాల మరణ భయం, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.