ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలి?

వినాయకచవితి రోజున ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పూజలు, ఆధ్యాత్మిక సాధనలకు ఈ దిశ అనుకూలమని భక్తుల నమ్మకం. అయితే గణపతికి పూజ చేసేటప్పుడు భక్తులు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి పూజ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. విగ్రహాన్ని నేలపై నేరుగా పెట్టకూడదని, చెక్క పీట లేదా ఎత్తయిన పూజా వేదికను సిద్ధం చేసి ఎరుపు లేదా పసుపు వస్త్రంపై ప్రతిష్ఠించాలని అంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕