TG: మేడ్చల్ సర్కిల్ లోని పూడూరు కిష్టాపూర్ 298 డివిజన్ కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రామ్ రెడ్డి, గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామ్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు. రాబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూడూర్ కిష్టాపూర్ డివిజన్ లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కృషి చేస్తానని రామ్ రెడ్డి తెలిపారు.